సూపర్‌ఫాస్ట్‌గా ముంబయి ఎక్స్‌ప్రెస్‌

ముంబయి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణ సమయం తగ్గనుంది. హైదరాబాద్‌-ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినల్‌ (సీఎస్‌ఎంటీ) ఎక్స్‌ప్రెస్‌ని సూపర్‌ఫాస్ట్‌గా మారుస్తున్నట్లు రైల్వే శాఖ బుధవారం ప్రకటించింది. హైదరాబాద్‌ నుంచి

Published : 29 Sep 2022 03:33 IST

 గంటా 40 నిమిషాల సమయం ఆదా

ఈనాడు, హైదరాబాద్‌: ముంబయి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణ సమయం తగ్గనుంది. హైదరాబాద్‌-ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినల్‌ (సీఎస్‌ఎంటీ) ఎక్స్‌ప్రెస్‌ని సూపర్‌ఫాస్ట్‌గా మారుస్తున్నట్లు రైల్వే శాఖ బుధవారం ప్రకటించింది. హైదరాబాద్‌ నుంచి ప్రస్తుతం ఈ రైల్లో ముంబయి వెళ్లేందుకు 16.10 గంటల సమయం పడుతోంది. అక్టోబరు1 నుంచి ఈ సమయం 14.30 గంటలకు తగ్గనుంది. ప్రయాణికులకు గంటా 40 నిమిషాల సమయం ఆదా అవుతుంది. ఈ రైలు నంబరు ప్రస్తుతం 17032 కాగా.. 22731కి మారుస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ రైలు హైదరాబాద్‌ నుంచి ప్రతి రోజు రాత్రి 8.50కు బయలుదేరుతుంది. అక్టోబరు 1 నుంచి 10.35కు వెళ్తుంది. తిరుగుప్రయాణంలో ముంబయి నుంచి హైదరాబాద్‌కి 15.20 గంటల సమయం పడుతోంది. సవరించిన టైంటేబుల్‌ ప్రకారం 14.20 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ రైలు నంబరునూ 17031 నుంచి 22732కి రైల్వేశాఖ మార్చింది.

ఏడు రైళ్లలో రెండో అత్యధిక వేగం

హైదరాబాద్‌ నుంచి ముంబయికి హుస్సేన్‌సాగర్‌, కోణార్క్‌, ముంబయి ఎక్స్‌ప్రెస్‌ సహా నిత్యం ఏడు రైళ్లు వెళ్తున్నాయి. హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌ 14.05 గంటల్లో ముంబయి చేరుతుంది. కొత్త టైంటేబుల్‌ ప్రకారం ముంబయి ఎక్స్‌ప్రెస్‌ 14.30 గంటల్లో చేరుకోనుంది. దేవగిరి ఎక్స్‌ప్రెస్‌కు 17.45 గంటల సమయం పడుతోంది. ఇతర ప్రధాన రూట్లలో రైళ్ల గరిష్ఠవేగాన్ని రైల్వేశాఖ 130 కి.మీ.కి పెంచింది. హైదరాబాద్‌-ముంబయి మార్గంలో 110 కి.మీ.కే పరిమితం చేసింది. అయినా కొన్నిచోట్ల సింగిల్‌ లైన్‌ తదితర సాంకేతిక కారణాలతో సగటు వేగం 55 కి.మీ.కే పరిమితమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని