సెక్షన్‌ అధికారుల సంఘం ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డికి ఎదురుదెబ్బ

రాష్ట్ర సచివాలయం సెక్షన్‌ అధికారుల అసోసియేషన్‌ ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. వెంకట్రామిరెడ్డి మద్దతు తెలిపిన అభ్యర్థులు ఓడిపోయారు. ఆయన వ్యతిరేక వర్గానికి

Published : 29 Sep 2022 03:33 IST

 అధ్యక్షుడిగా రంగస్వామి విజయం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర సచివాలయం సెక్షన్‌ అధికారుల అసోసియేషన్‌ ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. వెంకట్రామిరెడ్డి మద్దతు తెలిపిన అభ్యర్థులు ఓడిపోయారు. ఆయన వ్యతిరేక వర్గానికి చెందినవారు అధ్యక్ష, ఉపాధ్యక్ష మహిళ, కార్యదర్శి స్థానాలను కైవసం చేసుకున్నారు. అసోసియేషన్‌కు ఏప్రిల్‌ 8న పోలింగ్‌ జరిగింది. ఈ ఎన్నికపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం స్టే విధించింది. బుధవారం స్టే తొలగించడంతో ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. అధ్యక్షుడి స్థానానికి జరిగిన ఎన్నికలో నాగ సుబ్బారెడ్డిపై ఎం.రంగస్వామి విజయం సాధించారు. ఉపాధ్యక్షురాలిగా భార్గవి, కార్యదర్శిగా రాఘవరావు గెలుపొందారు. అదనపు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, ట్రెజరర్‌, ఉపాధ్యక్షుడి స్థానాలు గతంలో ఏకగ్రీవమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని