తిరుమలలో గరుడ సేవకు విస్తృత ఏర్పాట్లు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గరుడ వాహన సేవకు తితిదే యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. వాహనసేవ సందర్భంగా భక్తులు హారతినిచ్చే విధానాన్ని ఈ సేవకు తొలిసారి రద్దు చేసింది. అక్కడ కూడా భక్తులు నిల్చునేలా ఏర్పాట్లు చేసింది.

Updated : 01 Oct 2022 06:51 IST

3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా

ఈనాడు, తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గరుడ వాహన సేవకు తితిదే యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. వాహనసేవ సందర్భంగా భక్తులు హారతినిచ్చే విధానాన్ని ఈ సేవకు తొలిసారి రద్దు చేసింది. అక్కడ కూడా భక్తులు నిల్చునేలా ఏర్పాట్లు చేసింది. సేవకు మూడు లక్షలకుపైగా భక్తులు వస్తారని తితిదే అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నంనుంచే కనుమ దారుల్లో ద్విచక్రవాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. తిరుమలకు 12వేల వాహనాలనే అనుమతించనున్నారు. ఆ తర్వాత వచ్చే వాహనాలను తిరుపతిలోని అలిపిరి పాత చెక్‌పాయింట్‌, శ్రీవారి మెట్టుమార్గంలో పార్కింగ్‌ చేయిస్తారు. తిరుమలలో 30 వరకు పార్కింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. రాత్రి ఏడింటికి ప్రారంభమయ్యే గరుడ వాహన సేవ అర్ధరాత్రి వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య సాధారణంగా ఉంది. ధర్మదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని నాలుగు షెడ్లలో వేచి ఉన్నారు. దర్శనానికి వారికి 8గంటలకుపైగా సమయం పడుతోంది. శనివారం శ్రీవారి గరుడోత్సవం నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నంనుంచే గదుల కేటాయింపును తితిదే రద్దు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని