తిరుమలలో శ్రీవారి దర్శనానికి 48 గంటలు

తిరుమల శ్రీవారి దర్శనానికి తమిళనాడు నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

Updated : 08 Oct 2022 05:41 IST

తిరుమలకు భారీగా తరలివస్తున్న భక్తులు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి దర్శనానికి తమిళనాడు నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ధర్మదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు శుక్రవారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగ్‌రోడ్డు మీదుగా శిలాతోరణం, ఆక్టోపస్‌ భవనం, గోగర్భం డ్యామ్‌ వరకు వేచి ఉన్నారు. వీరికి ధర్మదర్శనానికి 48 గంటలకు పైగా సమయం పడుతోందని తితిదే ప్రకటించింది. క్యూలైన్‌లో ఉన్న కాంచీపురానికి చెందిన ఓ భక్తుడు స్పృహతప్పి పడిపోయాడు. అతన్ని తితిదే భద్రతా సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. రద్దీతో గదులు దొరక్క భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. పెరటాసిమాసం మూడో శనివారం నేపథ్యంలో వారాంతంలో రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లు తితిదే అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్‌ ఆక్టోపస్‌ భవనం వరకు చేరుకోవడంతో అప్పుడు ఆ ప్రాంతానికి వచ్చిన భక్తులను శనివారం ఉదయం 6గంటలకు రావాలని తితిదే భద్రతా సిబ్బంది సూచించారు. క్యూలైన్లలోకి ఎవరినీ అనుమతించలేదు. గురువారం 72,195 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. రూ.2.17 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని