అద్దె చెల్లించడం లేదని ఆర్బీకేకు తాళం

నెలల తరబడి అద్దె చెల్లించకపోవడంతో బాపట్ల జిల్లాలోని కొల్లూరు-1 రైతు భరోసా కేంద్రానికి ఆ ఇంటి యజమాని వేమూరి అమర్‌నాథ్‌ తాళం వేశారు.

Published : 04 Dec 2022 04:54 IST

ఏడాదికిపైగా విద్యుత్తు బిల్లులూ కట్టని వైనం

కొల్లూరు, న్యూస్‌టుడే: నెలల తరబడి అద్దె చెల్లించకపోవడంతో బాపట్ల జిల్లాలోని కొల్లూరు-1 రైతు భరోసా కేంద్రానికి ఆ ఇంటి యజమాని వేమూరి అమర్‌నాథ్‌ తాళం వేశారు. అద్దె చెల్లిస్తే కానీ తాళం తీసేది లేదని తేల్చిచెప్పారు. తన రెండంతస్తుల భవనంలో కింది భాగాన్ని నెలకు రూ.4వేల అద్దెకిస్తూ అమర్‌నాథ్‌ వ్యవసాయ శాఖతో ఒప్పందం చేసుకున్నారు. అధికారులు 18 నెలలుగా అద్దె చెల్లించడం లేదు. దీనిపై ఉన్నతాధికారులను కలిసినా స్పష్టమైన సమాధానం లేదని ఆయన వాపోయారు. వారు వాడుకున్న విద్యుత్తు బిల్లులనూ ఏడాది నుంచి చెల్లించలేదని, దీంతో సరఫరా నిలిపేశారని తెలిపారు. ఈనెల 16లోగా బకాయిలను చెల్లించాలని, లేనట్లయితే ఇంటి మొత్తానికి సరఫరా నిలిపేస్తామని పై అంతస్తులో ప్రస్తుతం నివసిస్తున్న తన తల్లిని విద్యుత్తు సిబ్బంది హెచ్చరించారని వాపోయారు. 18 నెలల అద్దె మొత్తం రూ.72 వేలు చెల్లించాల్సింది వాస్తవమేనని మండల వ్యవసాయాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. 10, 15 రోజుల్లో చెల్లిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని