తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం

బంగాళఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావం నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాలతోపాటు వాటి సమీపంలోని మరో రెండు జిల్లాలపై ఉంటుందని, తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 07 Dec 2022 05:15 IST

సీఎస్‌ జవహర్‌రెడ్డి వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: బంగాళఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావం నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాలతోపాటు వాటి సమీపంలోని మరో రెండు జిల్లాలపై ఉంటుందని, తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. తుపాను ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటున్న ముందస్తు చర్యలపై ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల సీఎస్‌లతో  మంగళవారం దిల్లీ నుంచి కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ‘మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేశాం. బలహీనంగా ఉన్న ఏటిగట్లు, రిజర్వాయర్లకు గండ్లు పడకుండా ప్రత్యేక దృష్టి సారించాం. ప్రస్తుతం 11 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 10 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అందుబాటులో ఉన్నాయి. మత్స్యకారులెవరూ సముద్రంలోకి చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశాం’ అని తెలిపారు. రాజీవ్‌ గౌబ మాట్లాడుతూ ‘ముఖ్యంగా పల్లపు ప్రాంతాల్లో నివసించే ప్రజల్ని, గుడిసెలు, కచ్చా ఇళ్లలో నివసించే వారిని అప్రమత్తం చేయాలి. ముందస్తు సన్నాహక ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావీయరాదు’ అని మూడు రాష్ట్రాల అధికారులకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని