అన్న మంత్రి.. చెల్లెలి పెత్తనం

తమను తిట్టడమే కాక చేయి చేసుకున్నారంటూ పలువురు వర్కర్లు ఫిజియాలజీ ప్రొఫెసర్‌ సుధారాణిపై కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపల్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్‌ సోదరి సుధారాణి కర్నూలు సర్వజన వైద్యశాలలో పనిచేస్తున్నారు.

Updated : 10 Dec 2022 05:39 IST

పలువురు కార్మికులకు వేధింపులు
వైద్య కళాశాల ప్రిన్సిపల్‌కు బాధితుల ఫిర్యాదు

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: తమను తిట్టడమే కాక చేయి చేసుకున్నారంటూ పలువురు వర్కర్లు ఫిజియాలజీ ప్రొఫెసర్‌ సుధారాణిపై కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపల్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్‌ సోదరి సుధారాణి కర్నూలు సర్వజన వైద్యశాలలో పనిచేస్తున్నారు. అన్న మంత్రి కావడంతో ఆమెకు అందరూ భయపడతారు. ఆమె రెండు నెలలుగా వైద్యకళాశాల లేడీస్‌ వార్డెన్‌గా ఉన్నారు. పారిశుద్ధ్య పనులు చేసేవారిని రోజూ తన ఇంటికి పంపాలంటూ కేర్‌ టేకర్‌ను ఆమె ఆదేశించారు. దీంతో నిత్యం ఇద్దరిని ఆమె ఇంటికి పంపుతున్నారు. గత నెల 30న మౌనిక, రాజశేఖర్‌ అనే కార్మికులను ప్రొఫెసర్‌ ఇంటికి పంపారు. తాను బండలు తుడుస్తుండగా.. సరిగా పనిచేయాలంటూ కొట్టి, తిట్టారంటూ కేర్‌టేకర్‌తో కలిసి బాధితులు మౌనిక, రాజశేఖర్‌ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ సుధాకర్‌కు శుక్రవారం ఫిర్యాదుచేశారు. తోటి వైద్యులనూ అలాగే తిడతారని, ఆమె అన్న మంత్రి కావడంతో ఫిర్యాదుచేస్తే ఏమైనా ఇబ్బందులు వస్తాయని చెప్పడం లేదని పలువురు పేర్కొంటున్నారు. దీనిపై ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ కార్మికుల ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని