పంచాయతీ కార్యదర్శుల క్లస్టర్‌ వ్యవస్థలో మార్పులు

ఏపీ పంచాయతీరాజ్‌ సబార్డినేట్‌ సర్వీసు నిబంధనలు-2010కి సవరణలు చేస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో విడుదల చేసింది.

Published : 25 Jan 2023 05:33 IST

పదోన్నతులకు మార్గం సుగమం

ఈనాడు, అమరావతి: ఏపీ పంచాయతీరాజ్‌ సబార్డినేట్‌ సర్వీసు నిబంధనలు-2010కి సవరణలు చేస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో విడుదల చేసింది. ఈ ప్రకారం గ్రేడ్‌-6 పంచాయతీ కార్యదర్శుల పదోన్నతులకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒకటి కంటే ఎక్కువ పంచాయతీలు కలిపి ఒక క్లస్టర్‌గా ఉండేవి. దీని ప్రకారం నాలుగు గ్రేడ్ల పంచాయతీ కార్యదర్శులు వీటిలో ఉండేవారు. 2019లో ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియలో భాగంగా జీవో 148 విడుదల చేసి గతంలో ఉన్న కార్యదర్శుల నాలుగు గ్రేడ్లను మరో రెండు పెంచి ఆరుకు చేర్చింది. ఇప్పుడు క్లస్టర్‌ వ్యవస్థలో మార్పులు సూచిస్తూ సర్వీసు నిబంధనల్లో సవరణలు చేశారు. దీని ప్రకారం గ్రేడ్‌-6 (డిజిటల్‌ అసిస్టెంట్లకు) పంచాయతీ కార్యదర్శుల గ్రేడ్‌-5 పోస్టుల్లో 50% వరకు పదోన్నతులు కల్పించనున్నారు. పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి పంచాయతీరాజ్‌శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని