హెటిరో కొత్త పైపులైనుకు అనుమతి

కొత్త పైపులైను ఏర్పాటుకు హెటిరో చేస్తున్న ప్రయత్నాలను మత్స్యకారులు 420 రోజులుగా ప్రతిఘటిస్తున్నప్పటికీ పరిశ్రమకు అనుకూలంగా కేంద్ర పర్యావరణశాఖ అనుమతులిచ్చేసింది.

Updated : 27 Jan 2023 06:05 IST

420 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నాపట్టించుకోని ఏపీ ప్రభుత్వం

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి: కొత్త పైపులైను ఏర్పాటుకు హెటిరో చేస్తున్న ప్రయత్నాలను మత్స్యకారులు 420 రోజులుగా ప్రతిఘటిస్తున్నప్పటికీ పరిశ్రమకు అనుకూలంగా కేంద్ర పర్యావరణశాఖ అనుమతులిచ్చేసింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో హెటిరో మందుల పరిశ్రమ పైపులైను నిర్మాణాన్ని స్థానికులు, మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లోనూ కేసు వేశారు. పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఎన్జీటీ నియమించిన కమిటీ గుర్తించి కంపెనీ నుంచి రూ.6.94 కోట్ల అపరాధ రుసుం వసూలుకు సిఫార్సు చేసింది. జాతీయ స్థాయి సంస్థలతో మరోసారి పరిశీలన జరిపించాలని సూచించింది. ఇవేవీ పట్టించుకోకుండా మరింత ఎక్కువ సామర్థ్యంతో వ్యర్థ జలాలను సముద్రంలోకి విడిచిపెట్టేందుకు పైపులైను నిర్మించుకోవడానికి పరిశ్రమకు అనుమతులొచ్చాయి. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర తీర ప్రాంత నిర్వహణ ప్రాధికార సంస్థల సిఫార్సుల మేరకు అనుమతులిస్తున్నట్లు కేంద్ర పర్యావరణశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులపై న్యాయస్థానంలో పోరాడతామని మత్స్యకారులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని