60% హాజరుతోనూ ఇంటర్‌ పరీక్షలకు అనుమతి

ఇంటర్మీడియట్‌లో 60% అంతకంటే ఎక్కువ హాజరు ఉన్న విద్యార్థులను పరీక్షకు అనుమతించేందుకు ఇంటర్‌ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది.

Updated : 03 Feb 2023 06:10 IST

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌లో 60% అంతకంటే ఎక్కువ హాజరు ఉన్న విద్యార్థులను పరీక్షకు అనుమతించేందుకు ఇంటర్‌ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. బోర్డు నిబంధనల ప్రకారం 75% హాజరు తప్పనిసరి. సరైన కారణాలతో ఏ విద్యార్థికైనా 60%-75% వరకు హాజరు ఉంటే ప్రతిపాదనలు పంపాలని ప్రిన్సిపాళ్లకు బోర్డు సూచించింది. విద్యార్థులు 10రోజుల తక్కువ హాజరుకు రూ.1000, ..15రోజుల వరకు రూ.1,500, 15 రోజులు మించితే రూ.2వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు