వైభవంగా మల్లన్న ప్రభోత్సవం

శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల మూడోరోజు మంగళవారం భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లకు నేత్రశోభితంగా ప్రభోత్సవం నిర్వహించారు.

Updated : 22 Mar 2023 05:57 IST

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల మూడోరోజు మంగళవారం భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లకు నేత్రశోభితంగా ప్రభోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు పూజలు చేశారు. మంగళవాయిద్యాల సందడి నడుమ స్వామి  అమ్మవార్లను ఆలయం నుంచి వెలుపలికి తీసుకువచ్చి విశేష పుష్పాలంకరణతో ముస్తాబు చేసిన ప్రభపై ఉంచారు. తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటక,    మహారాష్ట్ర నుంచి భారీగా తరలివచ్చిన భక్తుల కరతాళధ్వనుల మధ్య ఆలయ ప్రధాన పురవీధిలో ప్రభోత్సవం సాగింది. రాత్రి 7 గంటలకు మహాసరస్వతి అలంకారంలో భ్రమరాంబాదేవి.. భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లకు నందివాహనోత్సవాన్నీ రమణీయంగా నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని