జలాశయాల భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి

జలాశయాల భూ నిర్వాసితులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని వ్యాపారవేత్త రామచంద్రయాదవ్‌ డిమాండు చేశారు.

Published : 28 May 2023 05:07 IST

ఏరియల్‌ సర్వే చేసిన  వ్యాపారవేత్త రామచంద్రయాదవ్‌

పుంగనూరు, న్యూస్‌టుడే: జలాశయాల భూ నిర్వాసితులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని వ్యాపారవేత్త రామచంద్రయాదవ్‌ డిమాండు చేశారు. శనివారం ఆయన హెలికాప్టర్‌లో చిత్తూరు జిల్లా పుంగనూరు పురపాలక పరిధిలోని సమ్మర్‌ స్టోరేజి ట్యాంకు, నేతిగుట్టపల్లె, సోమల మండలం ఆవులపల్లె, అన్నమయ్య జిల్లాలోని ముదివేడు జలాశయాలను పరిశీలించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల రిజర్వాయర్ల వద్దకు వెళ్లకుండా పోలీసులు సోమల మండలంలో అడ్డుకోవడంతో ఏరియల్‌ సర్వే నిర్వహించినట్లు వివరించారు. ప్రస్తుతానికి పనులు ఆపేసినా.. భూ నిర్వాసితులకు పరిహారం, ప్రత్యామ్నాయం చూపాలనే నిబంధనలు అమలు చేయకుండా మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన గుత్తేదారు సంస్థ.. పనులు కొనసాగిస్తుండటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం చేస్తున్న దోపిడీలో ఇదొక భాగమని విమర్శించారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ప్రకటించారు. ఏరియల్‌ సర్వే చేపడితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించినా.. ముందడుగు వేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని