YS Avinash Reddy: పక్షపాత ధోరణితో రామ్‌సింగ్‌ దర్యాప్తు: సీబీఐ డైరెక్టర్‌కు ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును విచారించిన సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.

Updated : 24 Jul 2023 07:27 IST

ఈనాడు, కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును విచారించిన సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌సూద్‌కు ఈ నెల 19న ఆయన రాసిన లేఖ ఆదివారం వెలుగులోకి వచ్చింది. రామ్‌సింగ్‌ పక్షపాత ధోరణితో దర్యాప్తు చేశారని ఆరోపించారు. ఆయన దర్యాప్తు తీరును సమీక్షించాలని కోరారు. వివేకానందరెడ్డి రెండో పెళ్లి, బెంగళూరులో భూమి సెటిల్మెంట్ అంశాలను లేఖలో ప్రస్తావించారు. దస్తగిరి నిలకడ లేని సమాధానాల ఆధారంగా రామ్‌సింగ్‌ విచారణ జరిపారని అవినాష్‌ విమర్శించారు. రెండో భార్య పేరుతో ఉన్న ఆస్తి పత్రాలను ఎత్తుకెళ్లడానికి వివేకాను హత్యచేసి ఉండొచ్చన్న కోణంలో విచారణ జరగలేదని పేర్కొన్నారు. మున్నా లాకర్లోని నగదు వివరాలను సీబీఐకి ఎవరు చెప్పారని ప్రశ్నించారు. విచారణలో ఎస్పీ చేసిన తప్పులను సవరించాలని కోరారు. నిజమైన నేరస్తులను పట్టుకుని న్యాయం చేయాలని సీబీఐ డైరెక్టరును ఎంపీ కోరారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లపై అభ్యంతరాలు తెలిపారు. రామ్‌సింగ్‌ తన దర్యాప్తులో చాలా అంశాలను వదిలిపెట్టారని, ఈ కేసు దర్యాప్తులో అనేక అనుమానాలున్నాయని, వాటిపై పునఃపరిశీలించాలనిలేఖలో అవినాష్‌రెడ్డి కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని