ప‌న్ను మిన‌హాయింపు..త‌గ్గింపు..రాయితీల మ‌ధ్య తేడా ఏంటి?

మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 5 లక్షల వరకు ఉంటే, మీరు ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు  

Updated : 13 Jan 2023 11:46 IST

ప‌న్ను సంబంధిత వివ‌రాల గురించి చాలా మందికి అవ‌గాహ‌న ఉండ‌దు. దీనికోసం ప‌న్ను అధికారుల‌ననుంచి స‌ల‌హాలు తీసుకుంటారు. అయితే ప‌న్ను మిన‌హాయింపులు, త‌గ్గింపులు, రాయితీల మ‌ధ్య తేడా ఏంటి? దీని గురించి అంద‌రు తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

ప‌న్ను మిన‌హాయింపులు(Tax exemptions)
కొన్ని ర‌కాల ఆదాయం ప‌న్ను ప‌రిది నుంచి మిన‌హ‌యింపు ఉంటుంది. అంటే ఆయా మార్గాల ద్వారా వ‌చ్చిన ఆదాయంపై ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ప‌న్ను గురించి లెక్కించేట‌ప్పుడు మిన‌హాయింపు పొందే ఆదాయాన్నిముందుగా ప‌రిగ‌ణించాలి. ఉదాహ‌ర‌ణ‌కు హెచ్ఆర్ఏకి ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. మీకు హెచ్ఆర్ఏ వ‌స్తే దానిపై ప‌న్ను మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఏదైనా స్థిరాస్తి విక్రయించిన‌ప్పుడు పొందిన లాభాల‌ను నిర్ధేశిత కాలంలె తిరిగి ప్రాప‌ర్టిలో లేదా బాండ్ల‌లో పెడితే ప‌న్ను మిన‌హాయింపు కోర‌వ‌చ్చు. సెక్ష‌న్ 10(1) ప్ర‌కారం, ఆదాయ ప‌న్ను చ‌ట్టం 1961 వ్య‌వ‌సాయ ఆదాయంపై కూడా ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

ప‌న్ను త‌గ్గింపు(Tax deductions)
మీరు మీ జీతం లేదా మొత్తం ఐదు ర‌కాలుగా నుంచి ఆదాయం నుంచి మినహాయింపు ఆదాయాన్ని తీసివేసిన తర్వాత స్థూల ఆదాయాన్ని పొందుతారు. ఆ వ‌చ్చిన ఆదాయంలో మీరు పెట్టిన పెట్టుబ‌డుల‌ను ఆధారంగా చూపుతూ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు మీరు వేత‌న జీవులైతే ఒక‌ ఆర్థిక సంవ‌త్స‌రానికి మీ వేత‌నం నుంచి ప్రామాణిక మిన‌హాయింపు రూ.40 వేలు అనుకుందాం. దీంతో పాటు సెక్ష‌న్ 80సీ ప్ర‌కారం రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు కోర‌వ‌చ్చు ఒక‌వేళ మీరు ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్‌, ఎన్ఎస్‌సీ వంటి వాటిలో పెట్టుబ‌డుల‌కు. పిల‌ల్ల ట్యూష‌న్ ఫీజు, స్టాంప్ డ్యూటీ వంటివి కూడా ప‌న్ను త‌గ్గింపు పొందే పెట్టుబ‌డులు. దీంతో పాటు సెక్ష‌న్ 80డీ, 80ఈ, 80జీ వంటివి కూడా ప‌న్ను మిన‌హాయింపులు పొంద‌వ‌చ్చు.

ప‌న్ను రాయితీ(Tax rebates)

మీరు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి కొన్ని సందర్భాల్లో పన్ను తగ్గింపును అందిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 87 ఎ కింద, రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో, రూ. 12,500 వరకు రిబేటు పొందవచ్చు. మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 5 లక్షల వరకు ఉంటే, మీరు ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ప‌న్ను మిన‌హాయింపు, త‌గ్గింపులు, రాయితీల గురించి తెలుసుకొని పూర్తి ప‌న్నుప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని