Auto mobile: ఎస్‌యూవీ లుక్‌తో కొత్త టియాగో.. విడుదల చేసిన టాటా మోటార్స్‌

దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్‌ హ్యాచ్‌బ్యాక్‌ విభాగంలో మరో కొత్త కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న టియాగోకు ఎస్‌యూవీ లుక్‌ అందిస్త...

Updated : 04 Aug 2021 17:22 IST

దిల్లీ: దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్‌ హ్యాచ్‌బ్యాక్‌ విభాగంలో మరో కొత్త కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న టియాగోకు ఎస్‌యూవీ లుక్‌ అందిస్తూ టియాగో ఎన్‌ఆర్‌జీ పేరిట కొత్త కారును విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.6.57 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌, దిల్లీ) కంపెనీ నిర్ణయించింది. ఎస్‌యూవీ తరహాలో ఎక్కువ గ్రౌండ్‌ క్లియరెన్స్‌, పెద్ద టైర్లు, బాడీ క్లాడింగ్‌, రూఫ్‌ రైల్స్‌ వంటి సదుపాయాలు ఈ కారు సొంతం.

టియాగో ఎన్‌ఆర్‌జీ 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో 5 స్పీడ్‌ మాన్యువల్‌, ఏఎంటీ ట్రాన్స్‌మిషన్‌ వెర్షన్లలో వస్తోంది. 181 ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్‌, 15 అంగుళాల వీల్స్‌, పుష్‌ బటన్‌ స్టార్ట్‌, రియర్‌ పార్కింగ్‌ కెమెరా, ఆటోఫోల్డ్‌ ఓఆర్‌వీఎం, బ్లాక్‌ ఇంటీరియర్స్‌ వంటి ఫీచర్లు ఈ కొత్త టియాగోలో ఉన్నాయి. మునుపటి టియాగోలానే కొత్త కారు సైతం వినియోగదారులను ఆకట్టుకుంటుందని టాటా మోటార్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌, మార్కెటింగ్‌ అండ్‌ కస్టమర్‌ కేర్‌) రాజన్‌ అంబా ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుతం మొత్తం ప్యాసింజర్‌ వెహికల్స్‌ విక్రయాల్లో హ్యాచ్‌బ్యాక్‌ల వాటా 43 శాతంగా ఉండగా.. టాటా మోటార్స్‌ విక్రయాల్లో వీటి వాటా 46 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 3.5 లక్షల యూనిట్ల టియాగో వాహనాలను టాటా మోటార్స్‌ విక్రయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని