Axis Bank-Citibank: యాక్సిస్ బ్యాంక్ -సిటీ బ్యాంక్ డీల్ పూర్తి.. కస్టమర్ల పరిస్థితేంటి?
Axis Bank-Citibank deal: సిటీ బ్యాంక్ తన భారత వ్యాపారం కొనుగోలును యాక్సిస్ బ్యాంక్ పూర్తి చేసింది. ఇకపై సిటీ బ్యాంక్ కార్యకలాపాలన్నీ యాక్సిస్ బ్యాంక్ పరిధిలోకి రానున్నాయి. మరి ఖాతాదారుల విషయంలో ఎలాంటి మార్పులుంటాయ్?
ఇంటర్నెట్ డెస్క్: వివిధ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిటీ గ్రూప్‌నకు చెందిన సిటీ బ్యాంక్ (Citibank) తన భారత్ కన్జ్యూమర్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపారాన్ని యాక్సిస్ బ్యాంక్‌కు (Axis Bank) విక్రయించింది. గతేడాది మార్చిలో ఈ డీల్‌ను ప్రకటించగా... సరిగ్గా ఏడాది తర్వాత ఈ డీల్ పూర్తయ్యింది. దీంతో నేటి నుంచి (మార్చి 1 నుంచి) సిటీ బ్యాంక్ తాలుకా హోమ్‌లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు, సేవింగ్స్ ఖాతాలు వంటి వ్యాపారాలన్నీ యాక్సిస్ బ్యాంక్ నియంత్రణలోకి రానున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు యాక్సిస్ బ్యాంక్‌కు ఈ డీల్ ఉపయోగపడుతుంది. అసలేంటీ డీల్? యాక్సిస్ పరిధిలోకి ఏమేం రానున్నాయి? కస్టమర్ల విషయంలో వచ్చే మార్పులేంటి?
1902లో కోల్‌కతా కేంద్రంగా సిటీ గ్రూప్ భారత్‌లో తన వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది. 1985లో కన్జూమర్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. వందేళ్లకు పైగా సేవలను అందించిన ఈ సంస్థ.. గ్లోబల్ స్ట్రాటజీలో భాగంగా తన భారత్ వ్యాపారాన్ని విక్రయించాలని నిర్ణయించింది. భారత్ సహా 13 దేశాల్లో కార్యకలాపాలను మూసివేయనున్నట్లు 2021లోనే ప్రకటించింది. రిటైల్ బ్యాంకింగ్ నుంచి తప్పుకొని పూర్తిగా వెల్త్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదీ డీల్..
సిటీ గ్రూప్ నిర్ణయం మేరకు భారత వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు యాక్సిస్ బ్యాంక్ ముందుకొచ్చింది. వినియోగదారుల వ్యాపారం సహా కవరింగ్ లోన్స్, క్రెడిట్ కార్డులు, వెల్త్ మేనేజ్‌మెంట్, రిటైల్ బ్యాంక్ వ్యాపారాన్ని దాదాపు రూ.11,600 కోట్లకు యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసింది. దీంతో సిటీ బ్యాంక్ చెందిన 3,500 మంది ఉద్యోగులు యాక్సిస్ పరిధిలోకి రానున్నారు. అలాగే 18 నగరాల్లో ఉన్న సిటీ గ్రూప్‌నకు చెందిన ఏడు కార్యాలయాలు, 21 బ్రాంచ్‌లు, 499 ఏటీఎంలు యాక్సిస్ బ్యాంక్ చేతికి దక్కనున్నాయి. 30 లక్షల యూజర్లతో పాటు సుమారు 25 లక్షల సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లు యాక్సిస్ బ్యాంక్ పరిధిలోకి రానున్నారు. యాక్సిస్‌కు వ్యాపారాన్ని విక్రయించిన అనంతరం కూడా సిటీ ఉత్పత్తులు/ సేవలను, బ్రాంచులను, ఏటీఎంలను, ఇంటర్నెట్ బ్యాంకింగ్, సిటీ మొబైల్ యాప్‌ను యథావిధిగా వినియోగించుకోవచ్చని సిటీ బ్యాంక్ తన కస్టమర్లకు తెలియజేసింది. మార్చి 1 నుంచి యాజమాన్యాన్ని యాక్సిస్‌కు బదిలీ చేస్తున్నట్లు పేర్కొంది.
ఇవీ మార్పులు..
- సిటీ బ్యాంక్ అకౌంట్ నంబర్లు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు నంబర్లు, చెక్‌బుక్‌లు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లలో ఎలాంటి మార్పూ ఉండదు. ఎప్పటిలానే కొనసాగుతాయి.
- సిటీ బ్యాంక్ మొబైల్ యాప్, సిటీ బ్యాంక్ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు ఎప్పటిలానే పనిచేస్తాయి. క్రెడిట్, డెబిట్ కార్డు రివార్డు పాయింట్లు సైతం ఎప్పటిలానే ఉంటాయి.
- సిటీ ఇండియా ద్వారా ఎవరైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఉంటే ఆ సేవలను ఇకపై యాక్సిస్ అందిస్తుంది.
- సిటీ బ్యాంక్ వినియోగదారులు ఇకపై యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలను వినియోగించుకోవచ్చు. సిటీ బ్యాంక్ ఏటీఎంల్లో ఉన్న ఉచిత లావాదేవీ పరిమితులు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంల్లోనూ కొనసాగుతాయి. పరిమితి దాటిన తర్వాత ఛార్జీలు వర్తిస్తాయి.
- సిటీబ్యాంక్ ఎన్నారై డిపాజిట్లపై పాత వడ్డీ రేట్లే వర్తిస్తాయి. కొత్త డిపాజిట్లకు మాత్రం యాక్సిస్ బ్యాంక్ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.
- ఎవరైనా సిటీ బ్యాంక్ హోమ్‌లోన్ తీసుకున్నా (ప్రైమ్ లెండింగ్ రేట్, బేస్ రేట్, మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్) ఎలాంటి మార్పూ ఉండదు. ఏదైనా అప్‌డేట్ ఉంటే యాక్సిస్ బ్యాంక్ తెలియజేస్తుంది.
- సిటీ గోల్డ్ పేరిట గ్లోబల్ బ్యాంకింగ్ ప్రివిలేజెస్ మాత్రం ఇకపై కొనసాగవు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Azad: రాహుల్‌పై వేటు: ఇలాగైతే.. పార్లమెంట్, అసెంబ్లీలు ఖాళీయే: ఆజాద్
-
Sports News
MIW vs DCW: ముగిసిన దిల్లీ ఇన్నింగ్స్.. ముంబయి లక్ష్యం 132
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
OneWeb: వన్‌వెబ్ కాన్స్టలేషన్ సంపూర్ణం.. కక్ష్యలోకి 618 ఉపగ్రహాలు
-
Sports News
wWBC: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో లవ్లీనాకు స్వర్ణం
-
Movies News
Smriti Irani: ప్రెగ్నెంట్ అని తెలీదు.. షూట్ వల్ల అబార్షన్ అయ్యింది: స్మృతి ఇరానీ