బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్‌ అకౌంట్‌... విద్యార్థుల కోసం ప్రత్యేకంగా

Bank of Baroda BRO Savings Account: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా విద్యార్థుల కోసం బీఆర్‌ఓ పేరిట జీరో బ్యాలెన్స్‌ సేవింగ్‌ ఖాతాను తెరిచే సదుపాయం కల్పించింది. దీంతో పాటు అనేక ప్రయోజనాలు అందిస్తోంది.

Updated : 19 Dec 2023 19:07 IST

Bank of Baroda BRO Savings Account | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank of Baroda) విద్యార్థుల కోసం కొత్త సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్‌ని తీసుకొచ్చింది. బీఆర్‌ఓ (BRO Savings Account) పేరిట తీసుకొచ్చిన ఈ ఖాతాను 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయసు కలిగిన విద్యార్థులు తెరవొచ్చని తెలిపింది. మినిమమ్ బ్యాలెన్స్‌ అవసరం లేకుండానే ఈ ఖాతాతో బ్యాంకింగ్‌ సేవలు వినియోగించుకోవచ్చని పేర్కొంది. ‘‘బీఆర్‌ఓ ద్వారా విద్యార్థులు కనీస బ్యాలెన్స్‌ లేకుండా బ్యాంక్‌లో ఖాతా తెరవొచ్చు. దీనివల్ల వారికి ప్రయోజనం చేకూరుతుంది’’ అని బీఓబీ సీజీఎం రవీంద్ర సింగ్‌ నేగి చెప్పారు.

విస్తృత సంప్రదింపుల తర్వాతే స్టీల్‌ ప్లాంట్‌పై ముందుకు: కేంద్రం

 అర్హతను బట్టి జీవిత కాలం ఉచితంగా రూపే ప్లాటినమ్‌ డెబిట్‌ కార్డును అందిస్తారు. త్రైమాసికానికి రెండు సార్లు కాంప్లిమెంటరీ డొమెస్టిక్‌ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌ సదుపాయం ఉంటుంది. రూ.2 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజ్‌ ఉంటుంది. ఫ్రీ చెక్‌ లీవ్స్‌, ఫ్రీ ఎస్సెమ్మెస్‌/ఇ-మెయిల్‌ అలర్ట్స్‌ ఉంటాయి. డీమ్యాట్‌ ఖాతా వార్షిక నిర్వహణ ఛార్జీల్లో (AMC) 100 శాతం రాయితీ లభిస్తుంది. విద్యా రుణాలపై జీరో ప్రాసెసింగ్ రుసుముతో పాటు వడ్డీపై రాయితీ కూడా లభిస్తుంది. అర్హతను బట్టి ప్రత్యేకమైన క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్లు కూడా బ్యాంక్‌ అందిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని