డాబర్‌ ఇండియా నికర లాభం రూ.515 కోట్లు

దిగ్గజ FMCG ‘డాబర్‌ ఇండియా’ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

Published : 02 Nov 2023 17:01 IST

దిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం డాబర్‌ ఇండియా సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 5% వృద్ధితో 515.05 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో నికర లాభం రూ.490.06 కోట్లు. కార్యకలాపాల ద్వారా డాబర్‌ ఇండియాకి ఆదాయం 7.20% పెరిగి రూ.2,986.49 కోట్ల నుంచి రూ.3,203.84 కోట్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో తన అంతర్జాతీయ వ్యాపారంలో 23.60% వృద్ధిని నమోదు చేసింది. వడ్డీ, పన్నులు, తరుగుదల (EBITDA)కు ముందు ఆదాయాలు 10% పెరిగి రూ.661 కోట్లకు చేరుకున్నాయి. డాబర్‌ డైజెస్టివ్‌ వ్యాపారం 18.10% వృద్ధి చెందగా.. హోమ్‌కేర్‌ బిజినెస్‌ 15.10% వృద్ధిని నమోదు చేసింది. ఆయుర్వేద ఓటీసీ, ఎథికల్స్‌ బిజినెస్‌ 8.10% పెరిగింది. డాబర్‌ ఇండియా 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.2.75 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్‌ మొత్తం రూ.487.31 కోట్లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని