నలుగురు యువకుల ప్రాణాలు బలి తీసుకున్న సెల్ఫీ సరదా..

సెల్ఫీ సరదా నలుగురు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. హరియాణాలోని గురుగ్రామ్‌లో నిర్మాణంలో

Published : 17 Feb 2022 02:40 IST

గురుగ్రామ్‌: సెల్ఫీ సరదా నలుగురు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. హరియాణాలోని గురుగ్రామ్‌లో నిర్మాణంలో ఉన్న రైల్వే పైవంతెన వద్ద మంగళవారం రాత్రి నలుగురు యువకులు సెల్ఫీ తీసుకుంటుండగా.. రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. దిల్లీ నుంచి అజ్మీర్ వెళ్తున్న జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్.. సెల్ఫీ తీసుకుంటున్న నలుగురు యువకులను ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. యువకులంతా 18-21 ఏళ్ల వారని రైల్వే పోలీసులు తెలిపారు. రైలు సమీపిస్తున్నప్పటికీ యువకులు పక్కకు తప్పుకోకుండా సెల్ఫీ తీసుకోవడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వారిలో ఒకరు విద్యార్థి కాగా.. మిగిలిన ముగ్గురు యువకులు సెల్‌ఫోన్ దుకాణంలో పనిచేస్తుప్పట్టు గుర్తించారు. ఇలాంటి ఘటనలను ప్రమాదాలుగా రైల్వే పరిగణించడంలేదని ఉన్నతాధికారులు తెలిపారు. వారిని అతిక్రమణదారులుగానే పరిగణిస్తున్నట్లు వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని