చేతులూకాళ్లూ కట్టేసి.. సిగరెట్లతో భర్తకు వాతలు

‘‘నా భార్య మత్తుపదార్థాలు తీసుకొని రోజూ అర్ధరాత్రి వేళల్లో నన్ను హింసిస్తోంది. సిగరెట్లతో  వాతలు పెడుతోంది.

Published : 08 May 2024 03:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘నా భార్య మత్తుపదార్థాలు తీసుకొని రోజూ అర్ధరాత్రి వేళల్లో నన్ను హింసిస్తోంది. సిగరెట్లతో  వాతలు పెడుతోంది. నన్ను రక్షించండి మహాప్రభో!’’ అంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్యాభర్తల గొడవ అనుకొని పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో వీడియో ఆధారాలతో సహా బాధితుడు మళ్లీ పోలీస్‌స్టేషనుకు వచ్చాడు. భార్యకు తెలియకుండా ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చి వీడియో తీశాడు. ఆ వీడియోలో భర్తను ఆమె హింసిస్తున్న తీరు చూశాక.. పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. నిందితురాలిని అరెస్ట్‌ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నౌర్‌ జిల్లాకు చెందిన మనన్‌ జైదీ, మెహర్‌ జహాన్‌ భార్యాభర్తలు. మెహర్‌ భర్తను నిత్యం హింసించడం అలవాటుగా చేసుకొంది. మెహర్‌పై కేసు నమోదు చేశామని బిజ్నౌర్‌ జిల్లా ఏఎస్పీ మీడియాకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు