
హాథ్రస్ ఘటనలో షాకింగ్ మలుపు!
ఆరు నెలల్లో వందకు పైగా ఫోన్ కాల్స్..
దిల్లీ: హాథ్రస్ కేసులో కీలక మలుపు. బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుల్లో ఒకరితో అనేక సార్లు ఫోన్‌లో మాట్లాడినట్టు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. తమ వద్దనున్న కాల్ రికార్డుల ప్రకారం మృతురాలి సోదరుడు, నిందితుల్లో ఒకరైన సందీప్ ఠాకూర్ అనే వ్యక్తితో గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో సుమారు 104 సార్లు ఫోన్‌లో సంభాషించినట్టు వారు వెల్లడించారు. ఈ వివరాల ఆధారంగా బాధితురాలి సోదరుడిని ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు ప్రశ్నించారు. అయితే ఈ ఫోన్ సంభాషణల గురించి తనకేమీ తెలీదని.. తాను గానీ, తన కుటుంబంలో ఇంకెవరూ గానీ ఎవరితోనూ మాట్లాడలేదని చెప్పారు.
సెప్టెంబర్ 14న యూపీలోని హాథ్రస్ గ్రామంలో ఓ దళిత యువతిపై దాడి జరగ్గా.. తీవ్ర గాయాల పాలైన బాధితురాలు అదే నెల 29న మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సామూహిక అత్యాచారం జరిగిందని బాధితురాలు సహా పలువురు ఆరోపించారు. అయితే అటువంటిదేమీ జరగలేదని, మెడకు తగిలిన గాయం వల్లే ఆమె మరణించిందని పోలీసులు వాదిస్తున్నారు. ఈ ఘటనలో పోలీసులు మృతదేహాన్ని హడావుడిగా దహనం చేయడం విమర్శలకు తావిచ్చింది. అల్లర్లు చెలరేగవచ్చనే నిఘా వర్గాల సమాచారం మేరకే తాము ఈ చర్యకు పాల్పడ్డామని యూపీ పోలీసులు సుప్రీం కోర్టుకు వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Manipur landslide: 27కు చేరిన మణిపుర్ మృతులు.. 20 మంది జవాన్లే..!
-
General News
ED: మధుకాన్ గ్రూప్ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
-
Sports News
IND vs ENG: యువరాజ్ సింగ్‌ను గుర్తుచేసిన బుమ్రా
-
General News
Telangana News: తెలంగాణలో మరో 1,663 ఉద్యోగాల భర్తీకి అనుమతి
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs ENG: వర్షంతో ఆటకు అంతరాయం.. ఇంగ్లాండ్ 3 ఓవర్లకు 16/1
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- నీడనిచ్చి.. జాడ కరవయ్యావు!