Warangal: వరంగల్‌ జకోటియ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

వరంగల్‌ నగరంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

Updated : 28 Mar 2024 22:01 IST

వరంగల్‌ కార్పొరేషన్‌: వరంగల్‌ నగరంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పోచమ్మ మైదాన్‌ సమీపంలోని జకోటియ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో విద్యుదాఘాతం కారణంగా భారీగా మంటలు వ్యాపించాయి. వాణిజ్య సముదాయంలోని రెండో అంతస్తులో వ్యాపించిన మంటలతో పలుదుకాణాలు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజిన్లతో ఘటనా స్థలికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. ప్రమాద స్థలిని మంత్రి కొండా సురేఖ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని