Dastagiri: వివేకా హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరిపై అట్రాసిటీ, కిడ్నాప్‌ కేసు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై అట్రాసిటీ, అపహరణ కేసులు నమోదు చేశారు. 

Published : 31 Oct 2023 19:37 IST

ఎర్రగుంట్ల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై అట్రాసిటీ, అపహరణ కేసులు నమోదు చేశారు. నెల రోజుల క్రితం వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్లలో జరిగిన ప్రేమ వివాహం విషయంలో దర్యాప్తునకు సంబంధించి దస్తగిరిని సోమవారం ఎర్రగుంట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

‘నా భర్తను చంపడానికి కుట్ర చేస్తున్నారు’: షబానా

తన భర్తను చంపడానికి కుట్రపన్నినట్టు కనిపిస్తోందని దస్తగిరి భార్య షబానా వాపోయారు. ‘‘మా బంధువుల అమ్మాయికి ప్రేమ వివాహం మంచిది కాదని, ఆమె కుటుంబ సభ్యుల కోరిక మేరకు నచ్చజెప్పి వాహనంలో ఇంటికి తీసుకెళ్లారు. యువతి భర్త ఫిర్యాదు మేరకు ఆయనపై అట్రాసిటీ, కిడ్నాప్‌ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిన్న సాయంత్రం నుంచి పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఒక్క సారి చూపించాలని వేడుకున్నా పోలీసులు కనికరించడం లేదు. నా భర్తను చూపించేంత వరకు నా పిల్లలు, నేను ఎర్రగుంట్ల పోలీస్‌ స్టేషన్‌ వద్ద నుంచి కదిలేది లేదు. దస్తగిరి ఇంటి నుంచి బయటికి వెళ్తే ఏదో ఒక కేసు పెట్టి వేధిస్తున్నారు. కిడ్నాప్‌ చేశాడని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దస్తగిరి వెనుక 10మంది పోలీసులతో ఎస్కార్ట్‌ ఉన్న విషయం ఉన్నతాధికారులకు తెలియదా? యువతిని కిడ్నాప్‌ చేస్తుంటే ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసులకు తెలియదా?. నా భర్తకు ఏదైనా జరిగితే సీఎం జగన్‌ బాధ్యత వహించాలి’’ అని షబానా కన్నీటి పర్యంతమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని