Viveka Murder case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి 12 రోజుల  ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరైంది. 

Updated : 20 Sep 2023 18:49 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి 12 రోజుల  ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరైంది. అనారోగ్య కారణాల రీత్యా 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ భాస్కర్‌రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై చంచల్‌గూడ జైలు అధికారులు న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. నివేదిక పరిశీలించిన సీబీఐ కోర్టు భాస్కర్‌రెడ్డికి  సెప్టెంబరు 22 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు 12 రోజుల పాటు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. హైదరాబాద్‌ విడిచి వెళ్లరాదని ఆదేశించింది. వివేకా హత్యకేసులో ఏ5 నిందితుడిగా ఉన్న భాస్కర్‌రెడ్డి.. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని