Crime news: ఈ-బైక్‌లో మంటలు.. ఊపిరాడక తండ్రీకూతుళ్ల మృతి!

ఈ-బైక్​కు ఛార్జింగ్‌ చేస్తుండగా మంటలు చెలరేగి.. వెలువడిన పొగ కారణంగా ఊపిరాడక తండ్రీకూతురు మృతి చెందారు......

Published : 26 Mar 2022 21:51 IST

చెన్నై: వేసవి కాలంలో పోట్రోల్‌, డీజిల్‌ వాహనాల్లో మంటలు చెలరేగడం చూస్తూనే ఉంటాం. కానీ విద్యుత్తు వాహనాలకు కూడా మంటలంటుకోవడం మొదలయ్యాయి. ఛార్జింగ్​ చేస్తుండగా మంటలు వ్యాపిస్తున్న సంఘటనలు నమోదవుతున్నాయి. అలాంటి సంఘటనే తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో తాజాగా జరిగింది. ఈ-బైక్​కు ఛార్జింగ్‌ చేస్తుండగా మంటలు చెలరేగి.. వెలువడిన పొగ కారణంగా ఊపిరాడక తండ్రీకూతురు మృతి చెందారు. మృతులను దొరై​ వర్మ(49), ఆయన కుమార్తె మోహన ప్రీతి(13)గా పోలీసులు గుర్తించారు.

​ వర్మ చిన్న అల్లాపురమ్​లో వీడియోగ్రాఫర్​. మూడు రోజుల క్రితం ఓ సంస్థకు చెందిన ఈ-స్కూటర్​ను కొనుగోలు చేశారు. ఇంటికి తీసుకెళ్లి శనివారం రాత్రి ఛార్జింగ్​ పెట్టారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనంలో మంటలు అంటుకున్నాయి. దాంతో వెలువడిన పొగ హాలు మొత్తం వ్యాపించింది. బైక్​లో మంటలు రావటం, పొగ కారణంగా ఇంట్లోంచి బయటకు వచ్చే వీలులేకుండా పోయింది. మంటలు, పొగను గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే అగ్నిమాపక, పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. ఇరువురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని