మారుతీరావు చివరిగా ఎవరితో మాట్లాడారు?

సంచలనం సృష్టించిన మారుతీరావు అనుమానాస్పద మృతి కేసులో సైఫాబాద్‌ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌లోని చింతలబస్తీలో

Updated : 11 Mar 2020 10:06 IST

కొనసాగుతున్న దర్యాప్తు

హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన మారుతీరావు అనుమానాస్పద మృతి కేసులో సైఫాబాద్‌ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌లోని చింతలబస్తీలో గల వైశ్య భవన్‌లో మారుతీరావు మృతి చెందిన విషయం విదితమే. ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటే కేవలం కూతురు దూరమైందన్న బాధ మాత్రమేనా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. మారుతీరావు శరీరావయవాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించిన నేపథ్యంలో నివేదిక రావడానికి కనీసం రెండు వారాల సమయం పట్టనుంది. ఆలోపు చేయాల్సిన కార్యాచరణపై దృష్టి సారించారు. ఇప్పటికే అతను విష ప్రభావంతోనే మరణించినట్లు పోలీసులకు ఉస్మానియా వైద్యులు ప్రాథమిక సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. శరీరంపై ఎలాంటి గాయాలు లేవన్న విషయాన్నీ వివరించారు. మారుతీరావు మరణం తర్వాత అతడు చనిపోయిన గది నుంచి ఇప్పటికే సూట్‌కేసు, సెల్‌ఫోన్‌, పలు పత్రాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు అతనితో చివరి రెండు, మూడు రోజుల్లో మాట్లాడిన కాల్‌డాటాపైనా దృష్టి సారించినట్లు సమాచారం. కొంత సమాచారాన్ని సేకరించాక ఆయనతో టచ్‌లో ఉన్న వారిని పిలిచి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని