అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య

అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలో చోటు చేసుకుంది.

Published : 05 May 2024 05:47 IST

రామడుగు, న్యూస్‌టుడే: అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..దేశ్‌రాజ్‌పల్లి గ్రామానికి చెందిన కంకనాల రమేశ్‌ (43)కు సొంతంగా 0.30 ఎకరాల భూమి ఉంది. సాగునీటి వసతి లేకపోవడంతో రెండేళ్లుగా ఎకరంన్నర భూమి కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నారు. ఈ యాసంగి సీజన్‌లో వరిపంటకు మెడవిరుపు తెగులు సోకి దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయారు. గత, ప్రస్తుత అప్పులు మొత్తం రూ.3 లక్షలకు చేరుకోవడంతో దిగులు చెందిన రమేశ్‌ శుక్రవారం పురుగు మందు తాగారు. స్థానికులు గమనించి తొలుత కరీంనగర్‌ జిల్లా ఆసుపత్రికి, అక్కడి నుంచి వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. రమేశ్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రామడుగు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని