నూహ్‌ సామూహిక అత్యాచారాలు.. జంట హత్యల దోషులకు మరణ దండన

ఎనిమిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలిక సహా ఇద్దరిపై సామూహిక అత్యాచారం, జంట హత్యల కేసులో దోషులుగా తేలిన నలుగురు వ్యక్తులకు న్యాయస్థానం మరణ దండన విధించింది.

Published : 05 May 2024 03:45 IST

దిల్లీ: ఎనిమిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలిక సహా ఇద్దరిపై సామూహిక అత్యాచారం, జంట హత్యల కేసులో దోషులుగా తేలిన నలుగురు వ్యక్తులకు న్యాయస్థానం మరణ దండన విధించింది. హరియాణాలోని నూహ్‌ పట్టణంలో 2016 ఆగస్టులో ఈ దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. విచారణ జరిపిన పంచకూలాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం నేరగాళ్లకు శిక్షలు ఖరారు చేసింది. దోషుల దాడిలో ఒక బాధితురాలు, ఆమె భర్త మృతి చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని