Crime News: నల్గొండలో నిత్య పెళ్లికొడుకు.. 19 మందిని మోసం చేసిన మత ప్రచారకుడు

పెళ్లి పేరిట యువతులను మోసగిస్తున్న మత ప్రచారకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన తెలుగు బాప్టిస్టు చర్చిలో డ్రమ్స్‌ వాయించే మత ప్రచారకుడు,

Updated : 10 Nov 2021 08:26 IST


టీఎస్‌ విలియమ్స్‌

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: పెళ్లి పేరిట యువతులను మోసగిస్తున్న మత ప్రచారకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన తెలుగు బాప్టిస్టు చర్చిలో డ్రమ్స్‌ వాయించే మత ప్రచారకుడు, వైద్యఆరోగ్యశాఖలో ల్యాబ్‌టెక్నీషియన్‌గా పనిచేస్తున్న టీఎస్‌ విలియమ్స్‌ను మంగళవారం పోలీసులు రిమాండ్‌కు పంపారు. విలియమ్స్‌ తనను పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేశారు.. రూ.20 లక్షల నగదు తీసుకుని మరో మహిళను పెళ్లి చేసుకున్నాడంటూ జిల్లా కేంద్రంలోని బీటీఎస్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. విలియమ్స్‌ పలువురి యువతులతో సంబంధాలున్నట్లు పోలీసు విచారణలో తెలిసినట్లు సమాచారం. మత ప్రచారంతో పాటు డ్రమ్స్‌ వాయిస్తూ యువతులను తన వైపు ఆకర్శిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది.

నిత్య పెళ్లి కొడుకుగా మారి 19 మందిని మోసం చేసిన వ్యక్తి అంటూ సామాజిక, ప్రసార మాధ్యమాల్లో మంగళవారం హల్‌చల్‌ కావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునే యత్నం చేశారు. పోలీసులు ఇంటికి వస్తున్నారనే సమాచారం తెలియడంతో గుండెపోటు వచ్చినట్లు నటించి నల్గొండ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి పలు రకాల పరీక్షలు చేయించారు. గుండెతో పాటు ఇతర వైద్యపరీక్షలు చేసిన వైద్యులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పడంతో నిందితుడిపై ఐపీసీ 376,377,342,420 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్‌ సీఐ బాలగోపాల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని