నలుగురు కుమారులున్నా నిరాదరణ... వృద్ధురాలి ఆత్మహత్య!

నలుగురు కుమారులున్నా.. నిరాదరణకు గురైన ఓ వృద్ధురాలు.. మనోవేదనతో ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Published : 24 Mar 2023 04:32 IST

వీపనగండ్ల, న్యూస్‌టుడే: నలుగురు కుమారులున్నా.. నిరాదరణకు గురైన ఓ వృద్ధురాలు.. మనోవేదనతో ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ఎస్సై రామన్‌గౌడ్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వీపనగండ్లకు చెందిన కోమటి సరోజమ్మ(78) వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమెకు నలుగురు కుమారులున్నా ఎవరూ చేరదీయకపోవడంతో మనోవేదనకు గురయ్యారు. ఈ విషయాన్ని ఇరుగుపొరుగువారికి చెప్పి బాధపడేవారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపంతో గురువారం ఆమె ఒంటికి నిప్పంటించుకున్నారు. చుట్టుపక్కల వారు గమనించి, మంటలను ఆర్పి స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా, మార్గంలోనే ఆమె మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు