కర్ణాటక ధాన్యం పట్టివేత

కర్ణాటక నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న ధాన్యాన్ని పోలీసులు పట్టుకుని పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు అప్పగించారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఉప తహసీల్దారు గురురాజారావు మాట్లాడుతూ.. మిర్యాలగూడ, హైదరాబాద్‌ మిల్లులకు అక్రమంగా తరలిస్తున్న 16 లారీల వరి ధాన్యాన్ని మక్తల్‌ మండలం చందాపూర్‌ సమీపంలో సీఐ సీతయ్య, ఎస్సై ఎ.రాములు తమ సిబ్బందితో

Published : 16 May 2022 05:15 IST

నారాయణపేట జిల్లాలో.. 16 లారీల సరకు స్వాధీనం

మక్తల్‌, న్యూస్‌టుడే: కర్ణాటక నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న ధాన్యాన్ని పోలీసులు పట్టుకుని పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు అప్పగించారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఉప తహసీల్దారు గురురాజారావు మాట్లాడుతూ.. మిర్యాలగూడ, హైదరాబాద్‌ మిల్లులకు అక్రమంగా తరలిస్తున్న 16 లారీల వరి ధాన్యాన్ని మక్తల్‌ మండలం చందాపూర్‌ సమీపంలో సీఐ సీతయ్య, ఎస్సై ఎ.రాములు తమ సిబ్బందితో పట్టుకున్నారన్నారు. వే బిల్లులు లేకుండా 16 లారీల్లో 8 వేల బస్తాల ధాన్యాన్ని కర్ణాటక రాష్ట్రం యాదగిరి, సిర్పూర్‌, మాన్విల నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. దీని విలువ రూ.1.09 కోట్లకుపైగా ఉంటుందని తెలిపారు. డ్రైవర్ల వద్ద కాగితాలపై రాసుకున్న నకిలీ బిల్లులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. లారీ డ్రైవర్లు, యజమానులపై 6ఏ, క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, నివేదికను నారాయణపేట జిల్లా కలెక్టర్‌కు పంపించామన్నారు. ధాన్యంతో పాటు లారీలను మక్తల్‌ మార్కెట్‌ యార్డుకు తరలించామన్నారు.

చెక్‌పోస్టుల్లో తనిఖీలు ఏమయ్యాయి..?

తెలంగాణలోకి కర్ణాటకలోని మాన్వి నుంచి ధాన్యం తీసుకురావాలంటే నారాయణపేట జిల్లా కృష్ణా చెక్‌పోస్టు, యాదగిరి, సిరిపూర్‌ నుంచి తేవాలంటే కున్సీ చెక్‌పోస్టులతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వం నెలకొల్పిన రెవెన్యూ చెక్‌పోస్టులను దాటుకొని రావాల్సి ఉంటుంది. ఎలాంటి అనుమతి, బిల్లులు లేని 16 లారీల ధాన్యం చెక్‌పోస్టులను దాటి ఎలా వచ్చిందన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారులు కర్ణాటకలో రూ.1500లకు క్వింటాలు చొప్పున కొని తెలంగాణలోని కొనుగోలు కేంద్రాల్లో రైతుల పేర్లపై రూ.1965కు విక్రయించి లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలున్నాయి. వే బిల్లులు లేకుండా మిర్యాలగూడ, హైదరాబాద్‌కు తరలించాలంటే దారిలో చాలా చెక్‌పోస్టులుంటాయి.. పైగా డీజిల్‌ వ్యయం భారీగా అవుతుంది. అందుకని నారాయణపేట, కృష్ణా, మక్తల్‌ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లోనే రాజకీయ నాయకుల మద్దతుతో ఇక్కడి రైతుల పేరిట విక్రయిస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని