తుపాకీ పోగొట్టుకున్న హెడ్‌ కానిస్టేబుల్‌.. బస్టాండు టాయిలెట్లో మరిచిపోయి..

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ బస్టాండులో ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీఎఫ్‌) హెడ్‌ కానిస్టేబుల్‌ తుపాకీ (రివాల్వర్‌) పోగొట్టుకున్నారు.

Updated : 02 Oct 2022 07:37 IST

జహీరాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ బస్టాండులో ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీఎఫ్‌) హెడ్‌ కానిస్టేబుల్‌ తుపాకీ (రివాల్వర్‌) పోగొట్టుకున్నారు. బస్టాండులోని మరుగుదొడ్డిలో మర్చిపోయారు. జహీరాబాద్‌ పట్టణ ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం... జిల్లాలోని సిర్గాపూర్‌కు చెందిన అబ్దుల్‌ సికందర్‌ అలీ(33) జమ్మూలోని శ్రీనగర్‌ 21వ బెటాలియన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌. సెలవుపై స్వగ్రామం వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటక గుల్బర్గాలోని హజ్రత్‌ ఖాజా బందే నవాజ్‌ దర్గా దర్శనం కోసం వెళ్లి శనివారం ఉదయం జహీరాబాద్‌ బస్టాండులో దిగారు. అక్కడ శౌచాలయంలోకి వెళ్లిన ఆయన వెంటిలేటర్‌ వద్ద తన సర్వీసు రివాల్వర్‌ను ఉంచారు. కొద్దిసేపటికి.. బస్సు వచ్చిందని కుటుంబ సభ్యులు ఫోన్‌ చేశారు. హడావుడిగా బయటకు వచ్చి ఆయన బస్సు ఎక్కేశారు. నారాయణఖేడ్‌ వెళ్లిన తర్వాత రివాల్వర్‌ విషయం గుర్తొచ్చి జహీరాబాద్‌ బస్టాండుకు వచ్చి వెతికారు. ఫలితం లేకపోవడంతో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తుపాకీలోని బుల్లెట్లు సికందర్‌ జేబులోనే ఉండిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని