సంక్షిప్త వార్తలు (2)

బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులకు ఒడిశాలోని జగత్సింగ్‌పూర్‌ పోక్సో కోర్టు ఉరిశిక్ష విధించింది.

Updated : 30 Nov 2022 06:48 IST

అత్యాచారం, హత్య కేసులో ఇద్దరికి ఉరి

కటక్‌, న్యూస్‌టుడే: బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులకు ఒడిశాలోని జగత్సింగ్‌పూర్‌ పోక్సో కోర్టు ఉరిశిక్ష విధించింది. 2014లో జగత్సింగ్‌పూర్‌ జిల్లా తిర్తోల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఎనిమిదేళ్ల బాలికపై నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు షేక్‌ అసీఫ్‌, షేక్‌ షకీల్‌తోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మంగళవారం న్యాయమూర్తి అజయ్‌ కుమార్‌ మహంతి సాక్ష్యాధారాలు పరిశీలించి అసీఫ్‌, షకీల్‌ ఉరిశిక్ష ఖరారు చేశారు. మిగిలిన ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించారు.


దివ్యాంగ కుమార్తెపై తండ్రి అత్యాచారం..

107 ఏళ్ల శిక్ష విధించిన కోర్టు

దివ్యాంగురాలైన 13 ఏళ్ల కుమార్తె జననాంగాల్లోకి రాడ్‌ చొప్పించి.. దారుణంగా అత్యాచారం చేసిన తండ్రికి 107 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది పోక్సో కోర్టు. కేరళలోని పథనంథిట్ట జిల్లా జువైనల్‌ కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. జిల్లాలోని కుంబజాకు చెందిన 13 ఏళ్ల దివ్యాంగ బాలికపై 45 ఏళ్ల తండ్రి పశువులా ప్రవర్తించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 2020లో జరిగిందీ ఘటన. తాజాగా న్యాయస్థానం నిందితుడికి శిక్ష విధించింది. కొన్నేళ్ల క్రితమే నిందితుడిని అతని భార్య వదిలేసి వెళ్లింది. బాలిక మాత్రం తండ్రితోనే ఉంటూ పాఠశాలకు వెళ్తోంది. ఒంటరిగా ఉండే ఆమెపై అతడు ఈ దారుణాలకు ఒడిగట్టేవాడు.


Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు