మద్యం మత్తులో విద్యార్థినిపై అత్యాచార యత్నం

విద్యార్థినిపై అత్యాచారయత్నం జరుగుతుండగా పాఠశాల ఉపాధ్యాయులు కాపాడారు. భయపడిన నిందితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Updated : 30 Nov 2022 04:28 IST

కాపాడిన ఉపాధ్యాయులు

నిడమనూరు, న్యూస్‌టుడే: విద్యార్థినిపై అత్యాచారయత్నం జరుగుతుండగా పాఠశాల ఉపాధ్యాయులు కాపాడారు. భయపడిన నిందితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలోని ఓ గ్రామంలో మంగళవారం ఈ ఉదంతం చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక మంగళవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి పాఠశాల నుంచి బయట ఉన్న ఒక కిరాణ దుకాణం వద్దకు వెళ్లింది. ఆ సమయంలో త్రివేణ్‌ అనే యువకుడు మద్యం తాగి వచ్చి బాలికను పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఆ బాలిక ప్రతిఘటించి కేకలు వేయగా.. విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే అక్కడికెళ్లి ఆ యువకుడి నుంచి బాలికను కాపాడారు. పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో తనపై కేసు నమోదు అవుతుందని భయపడిన ఆ యువకుడు వెంటనే ఇంటికెళ్లి పురుగు మందు తాగాడు. పోలీసులు గ్రామానికి వెళ్లే లోపే స్థానికులు అతడిని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై శోభన్‌బాబు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని