కాంగ్రెస్ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌.. విరాళాలు సేకరించిన నిందితుడి అరెస్ట్‌

కాంగ్రెస్‌ పార్టీ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ రూపొందించిన నిందితుడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 23 Jan 2024 20:21 IST

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ రూపొందించి విరాళాలు సేకరించిన నిందితుడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది విరాళాల సేకరణ కోసం కాంగ్రెస్‌ ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ఇదే అదునుగా సైబర్‌ నేరగాళ్లు అదే పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించారు. కొందరు దీని ద్వారా చెల్లింపులు కూడా చేసినట్టు పార్టీ నేతలు గుర్తించి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజస్థాన్‌కి చెందిన సురేంద్ర చౌదరిని నిందితుడిగా గుర్తించారు. జైపుర్‌ వెళ్లి నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని