Adibatla kidnap case: యువతి కిడ్నాప్‌ కేసులో నవీన్‌రెడ్డి సోదరుడు నందీప్‌రెడ్డి అరెస్టు

డెంటల్‌ విద్యార్థిని  వీడియోలను సర్య్కూలేట్‌ చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేశారు.

Updated : 16 Dec 2022 22:04 IST

హైదరాబాద్‌: మన్నెగూడ వైద్య విద్యార్థిని అపహరణ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి సోదరుడు నందీప్‌రెడ్డి, వంశీ భరత్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. వైశాలి వీడియోలను పలు ప్రచార సాధనాల్లో ప్రసారం చేసినందుకుగానూ వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు బాధిత యువతి ఇచ్చిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవీన్‌రెడ్డి తనపై దుష్ప్రచారం చేశారని.. తనకు సంబంధించిన వీడియోలను నందీప్‌రెడ్డి, భరత్‌రెడ్డి పోస్టు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలికి సంబంధించిన వీడియోలను మీడియాలో ప్రసారం చేయవద్దని పోలీసు అధికారులు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని