Murder: భర్తను హతమార్చిన భార్య..బయటపెట్టిన కూతురు!
వివాహేతర సంబంధం మోజులో ఓ మహిళ కట్టుకున్న భర్తనే హత్య చేసింది. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ, సొంత కూతురే ఆమెను పోలీసులకు పట్టించింది.
లఖ్‌నవూ: వివాహేతర సంబంధం మోజులో ఓ మహిళ కట్టుకున్న భర్తనే హత్య చేసింది. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ, సొంత కూతురే ఆమెను పోలీసులకు పట్టించింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కవిత అనే మహిళ స్థానిక ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. ఆమెకు అదే ఆస్పత్రిలో ఇన్సూరెన్స్ విభాగంలో పని చేస్తున్న వినయ్‌శర్మతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో భర్త అడ్డు తొలగించుకోవాలని రాత్రిపూట అతడు నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిమి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని తాను పని చేస్తున్న ఆస్పత్రికే తీసుకెళ్లి..ఉరివేసుకొని భర్త మృతి చెందినట్లుగా నమ్మించింది.
ఫార్మాలిటీస్ పూర్తి చేసిన వైద్యసిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు గొంతుపై గాట్లు ఉన్నట్లు గుర్తించి అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. అనంతరం 13 ఏళ్ల వయసున్న కవిత కుమార్తెను పోలీసులు ప్రశ్నించగా.. తన తండ్రిని తల్లే చంపేసిందని, నిద్రిస్తున్న సమయంలో తలపై దిండుతో గట్టిగా అదిమి, అనంతరం గొంతు నులిమేసిందని, కిటికీలోంచి తాను కళ్లారా చూశానని పోలీసులకు చెప్పింది. ఆ సమాచారం మేరకు కవితను పోలీసులు ప్రశ్నించగా.. నేరం అంగీకరించింది. వాట్సాప్ చాటింగ్ డేటా ప్రకారం.. ఈ హత్యతో ఆమె ప్రియుడు వినయ్‌శర్మకు కూడా సంబంధం ఉందని పోలీసులు నిర్ధరించారు. ఇద్దరినీ అరెస్టు చేసినట్లు ఘజియాబాద్ పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
China: అమెరికా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలనుకుంటోంది
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Kotamreddy: కాసేపట్లో మళ్లీ మీడియా ముందుకు కోటంరెడ్డి
-
Crime News
కారులో మంటలు.. గర్భిణి, భర్త సజీవదహనం
-
Politics News
Raghurama: వైకాపాలో తిరగబడే రోజులు మొదలయ్యాయి: ఎంపీ రఘురామ
-
World News
12 మంది భార్యలు.. సెంచరీ దాటిన పిల్లలు!