TRS MLAs bribery scam: ఫొరెన్సిక్‌ ల్యాబ్‌కు ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నిందితులు

ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు.

Published : 11 Nov 2022 11:10 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు.  చంచల్‌గూడ జైలులో ఉన్న నలుగురు నిందితులను తొలిరోజు రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రశ్నించిన పోలీసులు.. ఇవాళ నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ (ఎఫ్ఎస్‌ఎల్‌)కు తీసుకెళ్లారు.

ఈ కేసులో కీలకమైన ఆడియో, వీడియో రికార్డుల విశ్లేషణ కోసం ల్యాబ్‌లో నిందితుల వాయిస్‌ రికార్డు చేయనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం నిందితులకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలను సిట్‌ తెలుసుకునే పనిలో పడింది. ఈ కేసులో రామచంద్రభారతి ఇచ్చే వాంగ్మూలం, ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక కీలకం కానున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుల వెనుక ఎవరున్నారనే అంశంపైనా సిట్‌ విచారణ చేపడుతోంది. నిందితుల కాల్‌ డేటా, సెల్‌ఫోన్‌లో వీడియోల ఆధారంగా పోలీసుల విచారణ కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని