Viveka murder case: సీబీఐ జాబితాలో మరికొందరు అనుమానితులు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 69వ రోజు కొనసాగుతోంది. కడప, పులివెందుల ప్రాంతాల్లో రెండు సీబీఐ బృందాలు అనుమానితులను

Updated : 15 Aug 2021 04:42 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 69వ రోజు కొనసాగుతోంది. కడప, పులివెందుల ప్రాంతాల్లో రెండు సీబీఐ బృందాలు అనుమానితులను విచారిస్తున్నాయి. పులివెందుల అతిథిగృహంలో సీబీఐ విచారణకు నలుగురు అనుమానితులు హాజరయ్యారు. తుమ్మలపల్లి కర్మాగారంలో పనిచేసే ఉద్యోగి ఉదయ్‌ కుమార్‌రెడ్డితో పాటు ఆయన తండ్రి ప్రకాశ్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఉదయ్‌ కుమార్‌రెడ్డి ఎంపీ అవినాష్‌రెడ్డికి సన్నిహితుడు కాగా ప్రకాష్‌రెడ్డి ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో పనిచేసే కాంపౌండర్‌. వీరితో పాటు ఉదయ్‌ కుమార్‌రెడ్డి ఇంటి పక్కన ఉంటున్న బాబురెడ్డి  దంపతులను కూడా ఇవే విషయాల గురించి సీబీఐ అధికారులు అడిగినట్టు తెలుస్తోంది. కడప కేంద్రగారం అతిథిగృహంలో మరో సీబీఐ బృందం ఇద్దరు అనుమానితులను విచారిస్తున్నారు. సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్‌ యాదవ్‌తో పాటు అతని సమీప బంధువు భరత్‌కుమార్‌ యాదవ్‌ను ప్రశ్నిస్తున్నారు. భద్రత కల్పించాలని వివేకా కుమార్తె సునీత ఎస్పీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పులివెందలలోని వివేకా ఇంటి వద్ద పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని