Suicide: యువకుడి వేధింపులకు యువతి బలి

యువకుడి వేధింపుల కారణంగా సోమవారం ఖమ్మం నగరంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడ మండల కేంద్రానికి చెందిన యువతి(17) ఎంఎల్‌టీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

Published : 05 Oct 2021 06:41 IST

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: యువకుడి వేధింపుల కారణంగా సోమవారం ఖమ్మం నగరంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడ మండల కేంద్రానికి చెందిన యువతి(17) ఎంఎల్‌టీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కరోనా కారణంగా కళాశాల నడవకపోవడంతో హాస్టల్‌లో ఉంటూ ఖమ్మంలో ప్రైవేటు ఆసుపత్రిలో అసిస్టెంట్‌ నర్సుగా పనిచేస్తోంది. కృష్ణా జిల్లా తిరువూరు మండలం మునుకోళ్ల గ్రామానికి చెందిన మల్లవరపు మధుకుమార్‌ పరిచయమయ్యాడు. బాలికతో చనువుగా ఉంటూ ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పలుమార్లు ఆమె దగ్గర నగదు కూడా తీసుకున్నాడు. నాలుగు రోజుల క్రితం ఆ ఆసుపత్రిని వదిలేసి ఓ టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో చేరింది. అయినా అతడి వేధింపులు ఆగకపోవడం, తన సెల్‌ఫోన్‌ తీసుకుని తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. తనతో మాట్లాడిన కాల్‌ రికార్డింగ్స్‌, ఫొటోలు బయటపెడతాననటంతో ఆ విషయం తన స్నేహితురాలి ఫోన్‌ ద్వారా తల్లికి చెప్పింది. సోమవారం హాస్టల్‌ బెడ్‌పై బాలిక చనిపోయి ఉండడం, పక్కన ఓ సిరంజీ, రెండు ఇంజక్షన్‌ బాటిళ్లు ఉండడంతో నిర్వాహకులు పోలీసులకు సమాచారమిచ్చారు. తన కూతురి ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని శిక్షించాలని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల క్రితం ఆ ఆసుపత్రిని వదిలేసి ఓ టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌లో చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని