logo

రోడ్లు నిర్మానుష్యం.. అవస్థల్లో జనం

ఆదిలాబాద్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా బుధవారం 42.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో మూడ్రోజులుగా ఎండలు మండిపోతున్నాయి.

Updated : 28 Mar 2024 03:14 IST

నిర్మానుష్యంగా మారిన ఆదిలాబాద్‌ ఎన్‌టీఆర్‌ కూడలి నుంచి బస్టాండ్‌కు వెళ్లే రహదారి

ఆదిలాబాద్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా బుధవారం 42.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో మూడ్రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే కలెక్టరేట్ కూడలిలో ఉదయం 10 గంటలకే నిర్మానుష్యంగా మారింది. ఎన్‌టీఆర్‌ కూడలి నుంచి బస్టాండ్‌కు వెళ్లే రహదారిలో సైతం కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. తప్పక బయటకు వచ్చినవారు ఎండ నుంచి రక్షించుకోవడానికి తల, ముఖానికి తడిపిన వస్త్రాలను కప్పుకొని వస్తున్నారు. రహదారులపై దుకాణాలు నిర్వహించే వాళ్లు తడిపిన దుప్పట్లను రక్షణగా కట్టుకుంటున్నారు. ఆటోడ్రైవర్లు సైతం ఆటోలపై అట్టముక్కలను ఏర్పాటు చేసుకున్నారు.

తడిపిన వస్త్రాలను రక్షణగా కట్టుకొని ప్రయాణిస్తున్న ఆదిలాబాద్‌ పట్టణవాసులు 

ఎండ నుంచి రక్షణగా ఆటోపై అట్టముక్కలు ఏర్పాటు చేసుకున్నారిలా..

ఎన్‌టీఆర్‌ కూడలిలో తడిపిన దుప్పట్లను కడుతున్న వర్తకులు

ఈనాడు, ఆదిలాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని