logo

అంతర్ రాష్ట్ర రహదారిపై భాజపా నాయకుల రాస్తారోకో

పొన్నారిలో గ్రామ పంచాయతీ సిబ్బంది శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా రహదారి, ఇళ్లపై ఏర్పాటుచేసిన కాషాయరంగు జెండాలను పంచాయతీ సిబ్బంది తొలగించారు.

Published : 27 Apr 2024 11:25 IST

తాంసీ: పొన్నారిలో గ్రామ పంచాయతీ సిబ్బంది శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా రహదారి, ఇళ్లపై ఏర్పాటుచేసిన కాషాయరంగు జెండాలను పంచాయతీ సిబ్బంది తొలగించారు. దీనిపై  భాజపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంతరాష్ట్ర రహదారిపై బైఠాయించి, గంటపాటు రాస్తారోకో చేశారు.  అధికారులు కాషాయ రంగు జెండాలను తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో ఆదిలాబాద్ నుంచి తాంసి, తలమడుగు మండలాలతోపాటు మహారాష్ట్ర వైపునకు  వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని