logo

కుటుంబాన్ని ఆదుకోవాలని ఆందోళన

విద్యుత్తు స్తంభంపై నుంచి పడి మృతి చెందిన జూనియర్‌ లైన్‌మెన్‌ నడిగొట్టు పవన్‌ కళ్యాణ్‌ మృతదేహంతో వారి కుటుంబీకులు ఆందోళన చేపట్టారు.

Published : 01 May 2024 03:06 IST

 విద్యుత్తు ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న కుటుంబీకులు, నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు

ఆదిలాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే : విద్యుత్తు స్తంభంపై నుంచి పడి మృతి చెందిన జూనియర్‌ లైన్‌మెన్‌ నడిగొట్టు పవన్‌ కళ్యాణ్‌ మృతదేహంతో వారి కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. శనివారం రిమ్స్‌ శవాగారం నుంచి మృతదేహాన్ని విద్యుత్తు ఎస్‌ఈ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి నినాదాలు చేశారు. తమను పోషించాల్సిన ఒక్కగానొక్క కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని, తమకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు బుచ్చయ్య, లక్ష్మి దంపతులు, సోదరి కోమల రోధించారు. వారికి మద్దతుగా నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు చేరుకున్నారు. రూ.50లక్షల నష్టపరిహారం, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. టూటౌన్‌ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని అటు కుటుంబీకులతో, అధికారులు, లైన్‌మెన్ల సంఘం నాయకులతో మాట్లాడారు. చివరకు లైన్‌మెన్‌ సంటెన్న రూ.3 లక్షలు, ఆదిలాబాద్‌ డివిజన్‌ కార్మికులు రూ.2 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు. శాఖాపరంగా రావాల్సిన నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా ప్రతిపాదనలు పంపుతామని అధికారులు ఒప్పుకోవడంతో కుటుంబీకులు ఆందోళన విరమించారు. నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు అంజయ్‌ కుమార్‌, వెంకటేష్‌, రామ్‌కుమార్‌, వేణుగోపాల్‌, శ్రీనివాస్‌, మురళీ, అఖిల్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని