logo

‘నిర్మల్‌ చరిత్ర’ పుస్తక రచయిత మృతి

చారిత్రక ప్రాశస్త్యమున్న నిర్మల్‌ విశేషాలను ‘నిర్మల్‌ చరిత్ర’ పేరిట పుస్తకరూపంలో తీసుకొచ్చిన రచయిత, విశ్రాంత ఉపాధ్యాయుడు అంకం రాములు (76) గురువారం రాత్రి మృతిచెందారు.

Published : 04 May 2024 06:12 IST

అంకం రాములు

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: చారిత్రక ప్రాశస్త్యమున్న నిర్మల్‌ విశేషాలను ‘నిర్మల్‌ చరిత్ర’ పేరిట పుస్తకరూపంలో తీసుకొచ్చిన రచయిత, విశ్రాంత ఉపాధ్యాయుడు అంకం రాములు (76) గురువారం రాత్రి మృతిచెందారు. కొద్దిరోజులుగా అస్వస్థతతో ఉన్న ఆయన పరిస్థితి విషమించడంతో చనిపోయారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా ఛైర్మన్‌ కొట్టె శేఖర్‌, తెలంగాణ రచయితల వేదిక జిల్లా సభ్యులు సంతాపం ప్రకటించారు. మృతదేహానికి శుక్రవారం నివాళులర్పించారు. పాత్రికేయుడిగా, ఉపాధ్యాయుడిగా, రచయితగా విభిన్న అంశాల్లో రాణించారని గుర్తుచేశారు. సంఘ గౌరవాధ్యక్షుడు దామెర రాములు, అధ్యక్షుడు నేరెళ్ల హన్మంతు, సలహాసభ్యులు డా.తుమ్మల దేవరావు, పత్తి శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని