logo

ఫోన్‌ చేయండి.. కథ వినండి

వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పాలనాధికారి బి.సంతోష్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు.

Updated : 04 May 2024 06:39 IST

సంబంధిత ప్రచార ప్రతులను విడుదల చేస్తున్న పాలనాధికారి బి.సంతోష్‌, డీఈవో యాదయ్య తదితరులు

మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్‌టుడే: వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పాలనాధికారి బి.సంతోష్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. రూమ్‌ టు రీడ్‌ సంస్థ అందిస్తున్న డయల్‌ అండ్‌ లిసన్‌ ఏ స్టోరీ కార్యక్రమం ప్రచార ప్రతులను డీఈవో యాదయ్యతో కలిసి విడుదల చేశారు. 040-45209722 నంబరుకు డయల్‌ చేసి ప్రతి రోజూ ఒక విజ్ఞాన కథ వినవచ్చని రూమ్‌టూరీడ్‌ సంస్థ అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సెలువులు వృథా కాకుండా విద్యార్థులు తమ ఆలోచన నైపుణ్యాల పెంపునకు దృష్టి సారించాలని సూచించారు. విద్యాశాఖ సమన్వయకర్త సత్యనారాయణ మూర్తి, మధు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని