logo

నిప్పుల కొలిమి

ఉమ్మడి జిల్లాపై భానుడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మే మొదటివారంలోనే ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి.

Published : 04 May 2024 06:17 IST

లక్షెట్టిపేట, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాపై భానుడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మే మొదటివారంలోనే ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. మరోవైపు ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో ఇల్లు దాటి కాలు బయట పెట్టేందుకు  ప్రజలు జంకుతున్నారు. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరో వైపు వడగాలులు.. వెరసి జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గాలిలో తేమ శాతం గణనీయంగా తగ్గిపోయి ఉక్కబోతతో ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఎండ తీవ్రత మరో వారం రోజులు ఇలానే కొనసాగే అవకాశం ఉంది. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో జనాలు బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. ఇక మధ్యాహ్నం నిప్పుల కొలిమిని తలపిస్తుండటంతో బయటకు రాలేని పరిస్థితి. సాయంత్రం 5 గంటల వరకు రోడ్లపై ఎక్కడ చూసినా కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉంటోంది. వీధి వ్యాపారులు, కూరగాయల అమ్మకందారులు, దుకాణాల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

జిల్లాలో శుక్రవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత(సెల్సియస్‌ డిగ్రీలలో)

మంచిర్యాల 46.6

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని