logo

ప్రక్షాళన మా నుంచే మొదలైంది.. మరి మీరు?

బాధితులకు ఫీజుల భారం నుంచి విముక్తి కలిగించేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంచిర్యాల జిల్లా అర్థోపెడిక్‌ సర్జన్‌ అసోసియేషన్‌(ఓఎస్‌ఏఎమ్‌) సభ్యులు అన్నారు.

Published : 05 May 2024 02:28 IST

కమీషన్‌ వ్యవస్థకు దూరమంటూ ఆర్థో సర్జన్ల తీర్మానం

 తీర్మాన సమావేశంలో పాల్గొన్న ఆర్థో సర్జన్స్‌ అసోసియేషన్‌ సభ్యులు

 మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే: బాధితులకు ఫీజుల భారం నుంచి విముక్తి కలిగించేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంచిర్యాల జిల్లా అర్థోపెడిక్‌ సర్జన్‌ అసోసియేషన్‌(ఓఎస్‌ఏఎమ్‌) సభ్యులు అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కమీషన్ల కోసం ప్రజలను పట్టిపీడిస్తున్న వ్యవస్థకు దూరంగా ఉండేందుకు సిద్ధమయ్యామని, మార్పు తమ నుంచే మొదలుపెట్టామన్నారు. వైద్యవృత్తిలో నిబద్ధతను పాటించేలా, విలువలు పెంపొందించేలా చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. సిఫారసు, కమీషన్‌ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడానికి జిల్లాలోని ఆర్థో సర్జన్లు ఏకతాటిపైకి వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రక్షాళన తమ నుంచే చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆలోచన చేసి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. కమీషన్‌ విధానంతో కొనసాగుతున్న ఆసుపత్రులకు తమ నుంచి ఎలాంటి సహకారం ఉండదన్నారు. ఆర్థోతో పాటు మిగతా విభాగాలు ముందుకొస్తే వైద్య వ్యవస్థ మరింత మెరుగు పడుతుందన్నారు. తెలంగాణ వైద్య మండలి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తనిఖీలు జిల్లాలోనూ కొనసాగుతాయని సభ్యుడు, ఉమ్మడి జిల్లా బాధ్యుడు ఎగ్గెన శ్రీనివాస్‌ అన్నారు. ఒత్తిళ్లతో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఓఎస్‌ఏఎమ్‌ సభ్యులు రాఘవరావు, కుమార్‌, అరవింద్‌, సంతోష్‌, ప్రవీణ్‌, రవి, శ్రీధర్‌, వసీమ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని