logo

ఎమ్మెల్యేల ప్రత్యేక ప్రార్థనలు

బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం కల్వర్ చర్చిలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌,  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Updated : 05 May 2024 11:58 IST

కాసిపేట: బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం కల్వర్ చర్చిలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌,  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి ఆవరణలో పాస్టర్ ప్రవీణ్ ఎమ్మెల్యేలతో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. చిన్న ప్రార్థన కేంద్రంగా మొదలై నేడు ఇంతలా అభివృద్ధి చెందడం అభినందనీయమని పాస్టర్ ప్రవీణ్‌ను అభినందించారు. అంతకముందు కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చొప్పరపల్లి చెక్ పోస్ట్ వద్ద ఎమ్మెల్యే గడ్డం వినోద్ వాహనాన్ని చెక్ పోస్ట్ అధికారులు తనిఖీ చేశారు. మంచిర్యాల నుంచి  నుంచి బెల్లంపల్లికి వెళ్తుండగా సోమగూడెం చొప్పరపల్లి వద్ద వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అధికారులకు ఎమ్మెల్యే సహకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని