logo

క్రాంతినగర్‌ ఘటనలో 40 మందిపై కేసులు

ఆదిలాబాద్‌ పట్టణంలోని క్రాంతినగర్‌లో శుక్రవారం రాత్రి, శనివారం చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన 40 మందిని బాధ్యులుగా గుర్తించి ఆదిలాబాద్‌ రెండో పట్టణ పోలీసులు ఆదివారం కేసులు నమోదు చేశారు.

Published : 06 May 2024 04:46 IST

ఆదిలాబాద్‌ నేర విభాగం, న్యూస్‌టుడే : ఆదిలాబాద్‌ పట్టణంలోని క్రాంతినగర్‌లో శుక్రవారం రాత్రి, శనివారం చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన 40 మందిని బాధ్యులుగా గుర్తించి ఆదిలాబాద్‌ రెండో పట్టణ పోలీసులు ఆదివారం కేసులు నమోదు చేశారు. ఒక జెండా విషయమై చోటు చేసుకున్న వివాదం వల్ల పోలీసులు ఆ కాలనీలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారీగా పోలీసు బలగాలను మోహరించి బందోబస్తును కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ లక్కిరెడ్డి జీవన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రస్తుతం ఎన్నికల నియమావళితో పాటు పోలీసు చట్టం-30 జిల్లా వ్యాప్తంగా అమల్లో ఉందన్నారు. క్రాంతినగర్‌ ఘటన విషయమై ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తే అలాంటి వారిపైనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం సభలు, సమావేశాలు నిర్వహించటం నిషేధమని, అయితే కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఎక్కడా గుమిగూడవద్దన్నారు. సమూహాలుగా ఏర్పడితే వీడియోల ఆధారంగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని