logo

డిగ్రీ ప్రవేశాల.. ‘దోస్త్‌’

ప్రభుత్వం డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్‌ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) ప్రకటన జారీ చేసింది. డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఈ నెల 6వ తేదీ రిజిస్ట్రేషన్లు ప్రారంభమై మూడు విడతల్లో సీట్లు కేటాయింపు జరగనుంది.

Published : 06 May 2024 04:55 IST

6 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వం డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్‌ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) ప్రకటన జారీ చేసింది. డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఈ నెల 6వ తేదీ రిజిస్ట్రేషన్లు ప్రారంభమై మూడు విడతల్లో సీట్లు కేటాయింపు జరగనుంది. విద్యార్థులు ఆధార్‌ కార్డుకు మొబైల్‌ నంబరు అనుసంధానమై ఉండాలి. లింక్‌ ద్వారా ఓటీపీ నమోదు చేసుకుని ప్రవేశ ప్రక్రియ ప్రారంభించవచ్చు. విద్యార్థులు రిజిస్ట్రేషన్‌కు ఇంటర్నెట్‌, మీ-సేవా కేంద్రాలను నుంచి దరఖాస్తు చేసుకోవాలి. జులై 8వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 12 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలుండగా.. 20కి పైనే ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. మొత్తం వివిధ కోర్సుల్లో 15వేలకు పైనే సీట్లు అందుబాటులో ఉన్నాయి.


సహాయ కేంద్రం ఏర్పాటు

కుమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్‌ లక్ష్మీనరసింహం ఆధ్వర్యంలో దోస్త్‌ సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దోస్త్‌ నమోదు ప్రక్రియలో విద్యార్థులకు ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు హెల్ప్‌లైన్‌ సెంటర్‌ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించడంతోపాటు విద్యార్థులకు మార్గదర్శకం అందిస్తారు.


అవసరమైన ధ్రువపత్రాలు

విద్యార్థులు పదో తరగతి మెమో, ఇంటర్‌ హాల్‌టికెట్‌ నంబరు, కుల, ఆదాయ ధ్రువ పత్రాలు, ఆధార్‌కార్డుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

  • ఇంటర్మీడియేట్‌ ఉత్తీర్ణులైన వారు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం తమ హాల్‌టికెట్‌ నంబరుతో దోస్త్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్‌ మార్కుల ఆధారంగా డిగ్రీలో ప్రవేశాలు కల్పిస్తారు.

మూడు దశల్లో సీట్ల కేటాయింపు

డిగ్రీ కళాశాలల్లో భర్తీకి తొలి దశ రిజిస్ట్రేషన్లు ఈ నెల 6 నుంచి ప్రారంభమై 25వ తేదీ వరకు కొనసాగుతాయి. రూ.200 రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈ నెల 15-27 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలి. జూన్‌ 3న దోస్త్‌ మొదటి దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది. జూన్‌ 4-10 మధ్యలో కాలేజ్‌లో సెల్ఫ్‌ రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

  • రెండో దశ రిజిస్ట్రేషన్‌ జూన్‌ 4-13 వరకు నిర్వహిస్తారు. రూ.400 రుసుంతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. జూన్‌ 4-14 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం. అదే నెల 18న సీట్ల కేటాయింపు, 19-24 మధ్యలో కళాశాలలో సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాలి.
  • మూడో విడత రిజిస్ట్రేషన్లు జూన్‌ 13-25 వరకు జరగనున్నాయి. రూ.400 రుసుంతో రిజిస్ట్రేషన్‌. జూన్‌ 19-25 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం. 28న మూడో దశ సీట్ల కేటాయింపు. 29 నుంచి జులై 3వ తేదీ మధ్యలో సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాలి.
  • జూన్‌ 29 జులై 5వ తేదీ మధ్యలో డిగ్రీ సీట్లు పొందిన వారంతా కళాశాలలో రిపోర్ట్‌ చేయాలి. జులై 1 నుంచి కళాశాల్లో పునరుశ్చరణ జరుగుతుంది. జులై 8 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి
- లక్ష్మినరసింహం, ప్రిన్సిపల్‌, డిగ్రీ కళాశాల, కాగజ్‌నగర్‌

డిగ్రీ కోర్సులకు ఇంజినీరింగు కోర్సులతో సమానంగా ఆదరణ ఉంది. ప్రభుత్వం డిగ్రీ కళాశాలల్లో కొత్త కోర్సుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటోంది. ఇంటర్మీడియేట్‌ ఉత్తీర్ణత అయిన వారు తమకు ఇష్టమైన కోర్సుల్లో చేరి, ఉన్నత విద్యతోపాటు, ఉన్నత స్థాయి ఉద్యోగాలకు దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని